Kamareddy | అభివృద్ధే నా లక్ష్యం…
పెద్ద మల్లారెడ్డి గ్రామ సర్పంచ్ అభ్యర్థి బాలగోని రాజాగౌడ్
Kamareddy | బిక్కనూర్, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా పెద్ద మల్లారెడ్డి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అని సర్పంచ్ అభ్యర్థి బాలగోని రాజా గౌడ్ అన్నారు. గ్రామంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కుల సంఘాలు, యువజన సంఘాలు, డ్వాక్రా మహిళలు ఆయనకు మద్దతుగా నిలిచాయి. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాలలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో సర్పంచిగా పోటీ చేయడం జరిగిందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తనపై నమ్మకంతో గ్రామ సర్పంచిగా గెలిపించాలని ఆయన కోరారు.

