TG | క్వాష్‌ పిటిషన్‌పై విచారణ.. హరీష్‌రావును అరెస్ట్ చేయవ‌ద్ద‌న్న‌ హైకోర్టు!

తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు స్వ‌ల్ప‌ ఊరట లభించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టివేయాలని హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం.. హరీశ్‌రావును అరెస్టు చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మరోసారి పొడిగించింది.

ఈ నెల 12 వరకు హరీశ్‌రావును అరెస్టు చేయవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.

Leave a Reply