Mahbubabad | రాష్ట్ర కబడ్డీ సెక్రటరీగా తోట సురేష్
Mahbubabad | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర కబడ్డీ (Kabaddi) అసోసియేషన్ జూయింట్ సెక్రటరీగా మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామానికి చెందిన తోట సురేష్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని వీరేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మద్ది మహేందర్ కు అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ పెద్దలందరికి కృతజ్ఞతలు తెలిపారు.

