Spirit| నాటి పోరాట స్ఫూర్తి ఎక్కడ?

Spirit| రాయపోల్, ఆంధ్రప్రభ : దేశ దాస్య శృంఖలాలు తెంచే పవిత్ర ఉద్యమంలో స్వాతంత్ర్య(independence) పోరాట వీరులతో తెలుగుకలం పోరాడిందంటే అది ఆంధ్రప్రభ దినపత్రికే (Andhraprabha Daily Newspaper) నని చిన్నమసాన్ పల్లి గ్రామస్థుడు రేకుల శివారెడ్డి పేర్కొన్నారు..

చిన్ననాటి గుర్తులను నెమరేసుకున్న శివారెడ్డి..
నా చిన్నతనంలో నా తండ్రి వారి మిత్రులు అప్పటి ఆంధ్రప్రభ పత్రిక కోసం వేచిచూసేవారము.. పత్రిక గ్రామానికి రావడం అనేది ఒక ప్రయాస. నేడు సెల్ ఫోన్ (cell phone) లోనే వార్తలు వస్తున్నాయి.. అరచేతిలో ప్రపంచలో ఏమి జరుగుతుందో తెలుసుకోవచ్చు.. రోజులు మారాయి.. అప్పటి ప్రేమ, ఆప్యాయతలు లేవు. అప్పట్లో అందరం వరుసలతో పలకరించుకునే వాళ్ళం. కానీ నేడు పలకరించినా మాట్లాడేటోల్లు లేరు.. మారుతున్న రోజులు, పోతున్న కాలానికి అనుగుణంగా (according to) మనుషులు మారుతున్నారు. ఏది ఏమైనా నాటి పత్రిక గ్రామాల్లో కనబడటం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

Leave a Reply