Nalgonda | రోడ్డు ప్రమాదం

Nalgonda | రోడ్డు ప్రమాదం
- పోలీస్ సిబ్బందికి గాయాలు
- సీఎం బందోబస్తుకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం.
- నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్.
Nalgonda | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : సీఎం బందోబస్తుకు వెళ్లి తిరిగి వస్తుండగా నల్లగొండ జిల్లా గుర్రంపోడు (Horseman) మండలం జువ్విగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం మక్తల్ లో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నల్లగొండ జిల్లా నుండి పోలీసులు బందోబస్తుకు వెళ్లారు.
డ్యూటీ ముగిసిన అనంతరం తిరిగి నల్లగొండకు వస్తుండగా మంగళవారం తెల్లవారుజామున జువ్విగూడెం వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. గాయపడ్డ సిబ్బందిని చికిత్స నిమిత్తం హుటాహుటిన నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి (Govt hospital) తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న సిబ్బందిని పరామర్శించి ప్రమాదం జరిగిన వివరాలను తెలుసుకున్నారు. సిబ్బందికి మెరుగైన చికిత్స అందించాలని వైద్య సిబ్బందిని ఆయన కోరారు.
