అర్జీలపై త్వరితగతిన చర్యలకు ఎమ్మెల్యే హామీ..

విస్సన్నపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబడిన ప్రజా దర్బార్ లో భాగంగా తిరువూరు శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో మండల ప్రజలు వివిధ సమస్యల పైన సుమారు 300 అర్జీలు తిరువూరు శాసనసభ్యులు వారికి అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా తిరువూరు శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తిరువూరు నియోజవర్గ పరిధిలో ఏ కొండూరు, తిరువూరు, గంపలగూడెం, మండలాలలో కంటే కూడా ఒక్క విస్సన్నపేట మండలంలో ప్రజా సమస్యలపై 300 అర్జీలకు పైగా ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారని ఆయన అన్నారు.

వచ్చిన అర్జీలు అన్నీ రైతులు పరంగా తమ భూములకు సంబంధించి 22ఏ,సమస్యలను పరిష్కరించాలని కొన్ని గ్రామాలలో సిసి రోడ్లు నిర్మించాలని దరఖాస్తులు వచ్చాయని ఆయన అన్నారు వచ్చిన అన్ని అర్జీలకు రెండు నెలల తర్వాత నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమం లోగా కొంతవరకు పరిష్కరిస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిన్న రాట్నాలు, తహసిల్దార్ కె కళ్యాణ్ లక్ష్మి, వివిధ శాఖల అధికారులు మరియు కూటమి నాయకులు గరిమెళ్ళ లోకేశ్వరరావు, మురుగుల ప్రసాదు,నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply