Edapalli | మూడోసారి దీవించండి..
రాజకీయాలలో అపార అనుభవం ఉంది
మరింత అభివృద్ధి చేస్తా..
కుర్నాపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి దుబ్బాక రవీందర్ గౌడ్
Edapalli | ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి (Edapalli) మండలం కుర్నాపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా శనివారం దుబ్బాక రవీందర్ గౌడ్ (Dubbaka Ravinder Goud) స్థానికంగా ఏర్పాటు చేసిన కేంద్రంలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆయన వెంట భారీగా అనుచరులు వచ్చారు. రాజకీయాలలో అపార అనుభవం కలిగిన తనను మూడోమారు గ్రామ ప్రజలు దీవిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. గ్రామస్తుల సహకారాలతో మూడోసారి సర్పంచ్‌గా విజయకేతనం ఎగురవేస్తానని రవీందర్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

