150 students | గ్రామీణుల ఆరోగ్యమే ల‌క్ష్యంగా..

150 students | గ్రామీణుల ఆరోగ్యమే ల‌క్ష్యంగా..

  • మెడిసిన్ విద్యార్థులు ఇంటింటా ఆరోగ్య పరీక్షలు

150 students | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఆరోగ్య పథకాలను అమ‌లు చేస్తుంద‌ని, వాటిపై అవగాహన ఉంటే ప్ర‌జ‌లు ఆరోగ్యవంతులుగా ఉంటార‌ని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సురేఖ(Dr. Surekha) పేర్కొన్నారు. ఈ రోజు చాబోలు గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల మొదటి సంవత్సరం 150 మంది విద్యార్థు(150 students)లు ప్రతీ ఇంటికి వెళ్లి ఆరోగ్య సమాచారం సేకరించారు.

డాక్టర్ సురేఖ మాట్లాడుతూ.. ఫ్యామిలీ దత్తత కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. మెడికల్ విద్యార్థులు(medical students) బ్యాచ్‌లుగా విడిపోయి ప్రతీ ఒక్క‌రు ఐదు ఇళ్ల వ‌ర‌కు వెళ్లి ఆ కుటుంబ సభ్యులకు ఏమైనా వ్యాధులతో బాధ ప‌డుతున్నారా అని వివరాలు నమోదు చేశారు.

మహిళల ఆరోగ్యం పై ప్రభుత్వం(Govt) ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందన్నారు. ఇంటింటి సర్వే ప్ర‌జ‌ల‌కు ఉపయోగకరంగా ఉంటుందని ప్రిన్సిపాల్ చెప్పారు. కార్యక్రమం నంద్యాల చుట్టుపక్కల గ్రామాలలో సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు.