SCOOTY | కొడుకు కళ్ల ముందే తల్లి మృతి

SCOOTY | కొడుకు కళ్ల ముందే తల్లి మృతి


ఆముదాలవలసలో దుర్ఘటన

SCOOTY | ( ఆమదాలవలస, ఆంధ్రప్రభ):
బూర్జ మండలం, కొల్లివలస గ్రామానికి చెందిన నున్నగొప్పల మణికంఠ అనే వ్యక్తి తన తల్లి నున్నగొప్పల భానుమతి తో కలసి స్కూటీపై కొల్లివలస నుండి శ్రీకాకుళం వైపు వెళుతుండగా ఆమదాలవలస ఫ్లై ఓవర్ బ్రిడ్జి కు దగ్గరలో శ్రీకాకుళం (Srikakulam) వైపు నుండి పాలకొండ వైపు కొబ్బరికాయల లోడుతో వెళుతున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో భానుమతి అక్కడికక్కడే మృతిచెందగా, కుమారుడు మణికంఠకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఆమదాలవలస పోలీసు లు ప్రమాదం జరిగిన స్థలం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందినది కావడంతో శ్రీకాకుళం రూరల్ పోలీసులకు సమాచారం అందించారు.గాయపడిన మణికంఠను శ్రీకాకుళం ఆసుపత్రికి చికిత్సకు తరలించారు. శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. మహిళ మృతదేహాన్ని శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కు తరలించారు.

Leave a Reply