Ballot Papers | బాధ్యతాయుతంగా పని చేయాలి

Ballot Papers | బాధ్యతాయుతంగా పని చేయాలి

Ballot Papers | ప్రతినిధి /యాదాద్రి, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల విధుల పట్ల ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు(Collector Hanumantha Rao) అన్నారు.
ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో పీఓ, ఓ.పీ.ఓల శిక్షణ తరగతులలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర చాలా కీలకమైనదన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు సజావుగా జరిగేలా చూసుకోవడంలో ప్రిసైడింగ్ అధికారుల(Presiding Officers) బాధ్యత ఉందన్నారు .ఎన్నికల విధులకు నియ‌మించిన‌ ప్రతి ఒక్కరు విధుల్లో చేరాలని ఎవ్వరికీ కూడా మినహాయింపు ఉండదన్నారు.

పోలింగ్ సామగ్రిని ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి బ్యాలెట్ పేపర్స్(Ballot Papers), పోలింగ్ బాక్సులు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా పోలింగ్ బాక్స్ ఓపెన్ చేయడం, సీల్ వేయడం చాలా ముఖ్యమైన అంశం కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం నిక్ష్పాక్షికంగా ఉండాలని తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో ప్రిసైడింగ్ అధికారులు, ఓ.పి.ఓ లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply