Tributes| పూలే జీవితం ఆర్శ‌నీయం

Tributes| పూలే జీవితం ఆర్శ‌నీయం

  • వ‌ర్థంతి నేపథ్యంలో క‌లెక్ట‌రేట్‌లో నివాళులు

Tributes| చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతిని కలెక్టరేట్‌లో నిర్వ‌హించారు. శుక్రవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఆయ‌న చిత్ర ప‌టానికి కలెక్టర్ సుమిత్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఆముద, చుట్టూ చైర్మన్ కటారి హేమలత, వన్నెకులక్షత్రియ చైర్మన్ త్యాగరాజన్, డీఆర్ఓ కే.మోహన్ కుమార్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి రబ్బాని బాష, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు షణ్ముగం, బీజేపీ నాయకులు అట్లూరి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ.. జ్యోతిరావు ఫూలే సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులని గుర్తుచేశారు. ప్రత్యేకంగా మహిళల విద్యాభివృద్ధికి చేసిన సాహాసోపేత‌ చర్యలను కొనియాడారు. సమాజంలో సమానత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలు చేసిన ఆయన అడుగుజాడలను అందరికీ ఆదర్శనీయమని తెలిపారు.

స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ, ఫూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని కట్గన్‌లో మాలి కులంలో జన్మించారని, భారతీయ కుల వ్యవస్థలో అతను శూద్రుడిగా పరిగణించబడినప్పటికీ, సమాజంలో అసమానతలను నాశనం చేసి, విద్యను పునాది వర్గాలకు తీసుకువచ్చేందుకు సత్య శోధక్ సమాజాన్ని 1873లో స్థాపించారని వివరించారు. పూలే భార్య సావిత్రిబాయి 1848లో బాలికల మొదటి మరాఠీ పాఠశాలను పూణెలో స్థాపించారని, ఇది సమాజంలో మహిళల విద్యాభివృద్ధికి మైలురాయి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ ఆముద, చూడ చైర్మన్ కటారి హేమలత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొడేలియర్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, బీసీ సంఘాల నాయకులు, నాయకులు, వివిధ సంక్షేమాధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply