- రేపు ఢిల్లీకి మంత్రి సవిత
- రాష్ట్రంలో పెట్టుబడులకు పలు పారిశ్రామికవేత్తలతో భేటీ
రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదివారం ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్-2025 కార్యక్రమంలో ఆమె పాల్లోనున్నారు.
పెట్టుబడులతోపాటు చేనేత వస్త్రాలకు మరింత మార్కెట్ సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారత్ టెక్స్-2025 అంతర్జాతీయ ప్రదర్శనను నిర్వహించింది. భారత్ టెక్స్ ఎగ్జిబిషన్ ఈ నెల 14న ప్రారంభమై 17వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు కొనసాగనుంది.
ఈ ఎగ్జిబిషన్‌లో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏపీ పెవిలియన్ ను ఏర్పాటు చేశారు. రాష్ట్రానికి చెందిన చేనేత సంస్థలతోపాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కూడా స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ప్రధాని నరేంద్రమోడి ఆదివారం భారత్ టెక్స్ ను సందర్శించి, టెక్స్ టైల్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
ఈ సమావేశానికి రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హాజరుకానున్నారు. ఆది, సోమవారాల్లో ఢిల్లీలోని ఉండి, రాష్ట్రంలో చేనేత రంగంలో పెట్టుబడుల కోసం ఎకానమిక్ డవలప్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో మంత్రి భేటీ కానున్నారు. రాష్ట్రంలో తయారవుతున్న చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ పెంచేలా కూడా భేటీలను వినియోగించుకునేలా మంత్రి సవిత ప్రణాళికలు రూపొందించుకున్నారు. మంత్రి వెంట పలువురు చేనేత, జౌళి శాఖాధికారులు ఢిల్లీకి వెళ్లనున్నారు.