Nizam College | తక్షణమె జీఓ 46 రద్దు చేయాలి

Nizam College | తక్షణమె జీఓ 46 రద్దు చేయాలి

  • తెలంగాణ బీసీ జేఏసీ నిరసన
  • నిజాం కాలేజీ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు బీసీలతో భారీ ర్యాలీ

Nizam College | ఖైరతాబాద్, ఆంధ్రప్రభ : బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు(42% reservations) కల్పిస్తామని వాగ్దానం చేసి, జీవో 46 ద్వారా 17%కు తగ్గించడం ప్రభుత్వం చేసిన పెద్ద మోసమని తెలంగాణ బీసీ జేఏసీ తీవ్రంగా విమర్శించింది. ఖైరతాబాద్ నియోజకవర్గం, హిమాయత్ నగర్ డివిజన్‌లోని నిజాం కాలేజీ(Nizam College) నుండి జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం సమీపంలోని ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు బీసీలతో కలసి పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ “ఎన్నికల ముందు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ, చట్టం, తీర్మానాలు అన్నీ వృథా అయ్యాయన్నారు. బీహార్ ఎన్నికలు ముగిసిన వెంటనే GO 46 జారీ(GO 46 issued) చేసి బీసీలను దగా చేశారని ఆయన తీవ్రంగామండిపడ్డారు.

జి ఒ 46 కారణంగా దాదాపు 1200 సర్పంచ్ స్థానాలు బీసీలకుదక్కలేదన్నారు. పలు మండలాలు–గ్రామాల్లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండాఅన్యాయం జరిగిందని తెలిపారు. కేంద్ర, రాష్ట్రప్రభ్యత్వాలకు బీసీల పై చిత్తశుద్ధి లేధన్నారు.ఈ నిరసనలో నీల వెంకటేష్,రాందేవ్, అంజి, ర్యాగ అరుణ్ కుమార్, కొండ దేవయ్య, భూమన్న యాదవ్, తదితర బీసీ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply