Machilipatnam | అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు

Machilipatnam | అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు
Machilipatnam | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బ్యానర్ (Banner) పై బుధవారం రాత్రి సోషల్ మీడియాలో మత భావనలను దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన మాదిరెడ్డి విజయ్ (Madireddy Vijay) పై గురువారం స్థానిక సంఘాలు చిలకలపూడి పోలీస్ స్టేషన్ (Chilakalapudi Police Station) లో ఫిర్యాదు చేశాయి. ఫిర్యాదు అందగానే డీఎస్పీ రాజా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
