Breaking | అనకాపల్లి వద్ద ప్రైవేట్ బస్సుకు అగ్నిప్రమాదం

ఆంధ్రప్రభ : అనకాపల్లి జిల్లా రేగులపాలె-ఎలమంచిలి సమీపంలో ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్తున్న తులసి ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్, సిబ్బంది వెంటనే ప్రయాణికులను కిందకు దించడంతో 45 మంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే బస్సు పూర్తిగా దగ్ధమై బూడిదైంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.