స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్…

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరోసారి న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాయి. సంగారెడ్డి జిల్లా మాజీ సర్పంచ్ ఆగమయ్య, బీసీ రిజర్వేషన్ల కేటాయింపు విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.

జీవో 46ను ఉల్లంఘిస్తూ, జిల్లాలోని 613 గ్రామ పంచాయతీల్లో కేవలం 117 పంచాయతీలకే బీసీ రిజర్వేషన్లు కేటాయించారని పిటిషనర్ తన వాదన వినిపించారు.

బీసీలకు 17% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వకపోవడం జీవోకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు.

Leave a Reply