Honor|డీసీసీ అధ్యక్షుడికి సన్మానం

Honor | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన జిల్లా కమిటీ అధ్యక్షుల్లో నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కాటిపల్లి నగేష్ రెడ్డి నియమితులయ్యారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియామకమైన కాటిపల్లి నగేష్ రెడ్డిని మోర్తాడ్ లోని ప్రజానిలయంలో మండల కాంగ్రెస్ నాయకులు కలిసి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకెట రవి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పడిగెల ప్రవీణ్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆల్గోట్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
