Health Bulletin – చిరంజీవి త‌ల్లి అంజ‌నాదేవికి అస్వ‌స్థ‌త …

హైద‌రాబాద్ – మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్యానికి గుర‌య్యారు. కుటుంబ స‌భ్యులు శుక్రవారం తెల్లవారుజామున ఆమెను హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆమెకు చికిత్స‌ను వైద్యులు కొన‌సాగిస్తున్నారు.ఇది ఇలా ఉంటే అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడలో ఉన్న కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన అధికారులతో నిర్వహించాల్సిన సమీక్షలను కూడా వాయిదా వేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. కాగా అంజనాదేవి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త బులిటిన్ విడుద‌ల చేయ‌నున్నారు.

Leave a Reply