Nizamabad | వరి ధాన్యం తరలింపులో నిర్లక్ష్యం చేయవద్దు…
Nizamabad | వరి ధాన్యం తరలింపులో నిర్లక్ష్యం చేయవద్దు…
Nizamabad | బిక్కనూర్, ఆంధ్రప్రభ : తూకం వేసిన వరి ధాన్యం తరలింపులో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం మాజీ ఎంపీపీ బస్వాపూర్ సొసైటీ డైరెక్టర్ సుదర్శన్(Sudarshan) సూచించారు. ఈ రోజు మండలంలోని కాచాపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రం వద్ద నిలువ ఉన్న వరి ధాన్యం కుప్పలను ఆయన పరిశీలించారు.
వరి ధాన్యం ఎండినప్పటికీ తూకం వేయడంలో నిర్లక్ష్యం చేయడం కాకుండా తూకం వేసిన వరి ధాన్యం లారీలలో రైస్ మిల్(Rice Mill)కు తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఆయన అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. వెంటనే వ్యవసాయ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు కేంద్రం వద్దకు వచ్చారు. తేమ శాతం పరిశీలించి సీరియల్ నంబర్(serial no) ఇవ్వాలని వ్యవసాయ సిబ్బందికి ఆయన సూచించారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా తూకం వేయాలని చెప్పారు. లారీల కొరత లేకుండా చూడాలని జిల్లా సివిల్ సప్లై అధికారుల(Civil Supply Officers)ను ఆయన కోరారు. లారీల కొరత వల్ల తూకం వేసిన వరి ధాన్యం రైస్ మిల్ కు తరలించడం లేదన్నారు. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు సుదర్శన్ తెలిపారు. రైతులకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు.
