Ambedkar | మహనీయులను స్మరించుకోవాలి
Ambedkar | మహనీయులను స్మరించుకోవాలి
- తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్
- అంబేద్కర్ విగ్రహానికి నివాళులు
మోత్కూర్, ఆంధ్రప్రభ : ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అతి పెద్దదని, రాజ్యాంగ రచనలో డా. బీఆర్ అంబేద్కర్ (Dr. BR Ambedkar) కులమతాలకతీతంగా సామాజిక న్యాయం పాటించారని, మహనీయులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి 9 నెలల పాలనలోనే 40 ఏళ్ల పోరాటానికి ఎస్సీ వర్గీకరణ అమలు చేశారని, బీసీలకు కులగణన చేసి 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు శతవిధాలా కృషి చేస్తున్నారన్నారు.
ఇటీవల మరణించిన మహాకవి అందెశ్రీ పాడెను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కన్న కొడుకులా మోశారని, అన్ని కార్యక్రమాలు స్వయంగా నిర్వహించి తన అభ్యుదయ వాదాన్ని చాటారన్నారు. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సామాజిక న్యాయం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి, జిల్లా నాయకులు గుర్రం లక్ష్మీనర్సింహా రెడ్డి, అవిశెట్టి అవిలిమల్లు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుండగోని రామచంద్రు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు మెంట నగేష్, కూరేళ్ల శ్రీరాములు, మార్కెట్ డైరెక్టర్ పోచం జగన్, నాయకులు మందుల సురేష్, ఎర్రబెల్లి నర్సయ్య, గుండు శ్రీను, కూరేళ్ల రాములు, దుర్గయ్య పాల్గొన్నారు.
