Gudivada | యూనియన్ బ్యాంకులో ఫైర్..

Gudivada | యూనియన్ బ్యాంకులో ఫైర్..
Gudivada, గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ యూనియన్ బ్యాంక్ (Union Bank) లో అగ్ని ప్రమాదం జరిగింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది రావడంతో పెను ప్రమాదం తప్పింది. బైపాస్ రోడ్డులోనీ బ్యాంక్ కార్యాలయం నుండి పొగలు రావడంతో… స్థానికులు అగ్ని మాపక శాఖకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది… బ్యాంక్ అద్దాలు పగల కొట్టి మంటలను అదుపు చేశారు.
ప్రమాదంలో బ్యాంకులోని కంప్యూటర్లు, ఫర్నిచర్ దగ్ధం అయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని బ్యాంక్ అధికారులు తెలిపారు. అగ్నిమాపక శాఖ అధికారులు సకాలంలో రావడంతో పెద్దగా నష్టం జరగలేదనీ అధికారులు చెప్పారు. చిన్న చిన్న ఫర్నిచర్ అంతా స్వవ్యంగానే ఉంది ఎవరు ఆందోళన చెందనవసరం లేదని ఖాతాదారులకు బ్యాంక్ అధికారులు తెలిపారు.
