Divine darshan | దగ్గరగా కనకదుర్గమ్మ దివ్యదర్శనం

Divine darshan | దగ్గరగా కనకదుర్గమ్మ దివ్యదర్శనం

  • సామాన్య భక్తులకు అంతరాలయ దర్శనం
  • సుమారు 1500 మంది భక్తులకు అంతరాలయ దర్శనం
  • విజయవంతమైన ట్రయిల్ రన్
  • ఆనందం వ్యక్తం చేస్తున్న భక్తులు
  • బోర్డు ఆమోదం తరువాత కమిషనర్ పరిశీలనకు

Divine darshan | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఇప్పటివరకు వీఐపీలకు, రూ. 500 టికెట్ కొనుగోలు చేసిన వారికి మాత్రమే లభించిన అంతరాలయంలోని అమ్మవారి దివ్య దర్శన భాగ్యం ఇప్పుడు సామాన్య భక్తులకు కూడా అందుబాటులోకి రానుంది. సామాన్య భక్తులకు సైతం కనకదుర్గ అమ్మవారిని దగ్గర నుంచి చూసుకునే విధంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం (Sri Durga Malleswara Swamy Temple) అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైయున్న కనకదుర్గ అమ్మవారి దివ్యదర్శన భాగ్యాన్ని సామాన్య భక్తులకు దగ్గరగా అందించే క్రమంలో వారికి ఉచితంగా అంతరాలయ దర్శనాన్ని కల్పించారు. సామాన్య భక్తులకు అంతరాలు దర్శనం పేరిట ప్రయోగాత్మకంగా మంగళవారం అమలు చేసి చూశారు.

దేవస్థానం పాలకమండలి చైర్మన్ బొర్రా గాంధీ (Borra Gandhi) ఈవో శీనా నాయక్ స్వయ పరివేక్షణలో మంగళవారం రాహుకాల సమయంలో గంటసేపు సామాన్య భక్తులకు అంతరాలయ భాగ్యాన్ని కల్పించారు. ఉచిత క్యూ లైన్ లో ద్వారా అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులను అంతరాలయ క్యూలైన్లోనికి కలిపి అమ్మవారి దర్శనాన్ని దగ్గర నుండి ఏర్పాటు చేశారు. సుమారు 1500 మంది భక్తులు మంగళవారం నిర్వహించిన ట్రయిల్ రన్ లో అంతరాలయ దర్శనం ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. సామాన్య భక్తులకు ఇలా అంతరాలయ దర్శనం కల్పించే అంశంపై బోర్డు సర్వసభ్య సమావేశంలో చర్చించి తరువాత దేవాదాయశాఖ కమిషనర్ అనుమతి కోసం అధికారులు ప్రతిపాదనలు పంపనన్నారు. సామాన్య భక్తులకు కూడా అమ్మవారి అంతరాలయ దర్శన భాగ్యాన్ని కల్పించడం పట్ల సామాన్య భక్తుల నుంచి ఆనందం, హర్షం వ్యక్తం అవుతుంది.

Leave a Reply