Sarees | ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరలు.

Sarees | ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరలు.

మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్న కాటం వెంకటేశం ఆవుల మాధవి.

Sarees | చిట్యాల, ఆంధ్రప్రభ : దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇందిర స్వశక్తి పేరు మీద ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తుందని మండల మాజీ మార్కెట్ చైర్మన్ కాటం వెంకటేశం, జిల్లా సమాఖ్య మహిళా అధ్యక్షురాలు ఆవుల మాధవి అన్నారు. సోమవారం నాడు మండల పరిధిలోని పెద్ద కాపర్తి గ్రామ సచివాలయం దగ్గర ఇందిరమ్మ చీరల ను మహిళలకు పంపిణీ చేసి మాట్లాడారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రతి మహిళ లక్షాధికారి కావాలనే ఉద్దేశంతోనే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్తు, క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు ఇలా అనేక రకాలుగా మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసనసభ్యులు వేముల వీరేశం సహకారంతో గ్రామానికి 62 ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని అందరికీ దశలవారీగా వస్తాయని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కంచర్ల గౌతంరెడ్డి, నీలకంఠం లింగస్వామి, తొలిసూరు సైదులు, సాగర్ల నాగరాజు, ఏదుల లక్ష్మి, ఏర్పుల శ్రీలత, ఏర్పుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply