DUBAI | అండగా ఉంటాడు అనుకుంటే..

DUBAI | అండగా ఉంటాడు అనుకుంటే..
DUBAI | జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని ఉషేగాం గ్రామానికి చెందిన మెస్రం పాండురంగ్, జంగుబాయి దంపతుల కుమారుడు మెస్రం అనిల్ (28). ఏంబిఏ పూర్తి చేసి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో (At Hyderabad Shamshabad Airport) 4 ఏళ్లుగా కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే.. అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడని తల్లిదండ్రులు, జైలు మండలం ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షులు కొముర భగవంతరావు తెలిపారు. తల్లిదండ్రులు వ్యవసాయ పనులు చేసుకుంటూ తన కుమారుడిని చైనాలో ఎంబీఏ పూర్తి చేయించారని, హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులకు అండగా ఉంటాడని తెలిపారు. తల్లిదండ్రుల ఆశలు అడియాశలు అయినట్లు కుమ్ర భగవంత్ రావు తెలిపారు.
పాండురంగ దంపతులకు ఇద్దరి కుమారులని.. ఈ కుమారుడు ఎంతో ఎదగాలని ఉన్నత విద్య చదివి ఉద్యోగం చేస్తూ ఉండగా మరో కుమారుడు వికలాంగుడని చెప్పారు. ఈ కొడుకు ఉద్యోగం చేసి అండగా ఉంటాడని అనుకుంటే అనారోగ్యానికి గురై మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదం కలిగించిందని ఆయన తెలిపారు. మృతి చెందిన మెస్రం అనిల్ కు ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తూ దుబాయ్ కంపెనీలో (In Dubai Company) ఉద్యోగానికి పరీక్షలు రాసాడు. ఆ కంపెనీ నుండి జాబ్ కు రమ్మని కాల్ లెటర్ వచ్చిందని.. ఈ నెలలో దుబాయ్ కంపెనీ ఉద్యోగంలో చేరేవాడని.. ఇంతలో మృతి చెందడం జరిగిందని అన్నారు. దుబాయ్ కంపెనీలో ఎక్కువ వేతనాలు ఇస్తారని.. తల్లిదండ్రులకు అనిల్ చెప్పినట్లు ఆయన తెలిపారు. ఉన్నత విద్యా చదువుకున్న అనిల్ మృతి చెందడం ఆ గ్రామంలో విషాదాన్ని నింపినట్లు ఆయన తెలిపారు.
