COURT | నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం
COURT | నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం
COURT | ఢిల్లీ, ఆంధ్రప్రభ : సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) ఆయనకు ప్రమాణం చేయించగా, 2027 ఫిబ్రవరి 9 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. హరియాణా నుంచి ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టిన తొలి వ్యక్తిగా జస్టిస్ సూర్యకాంత్ కొత్త రికార్డు నెలకొల్పారు. 1962 ఫిబ్రవరి 10న హిస్సార్ జిల్లాలో జన్మించిన ఆయన ప్రమాణ స్వీకార వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అనేకమంది కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
