- రేపటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు !
రంజాన్ మాసం నెలవంక కనిపించింది. ఈరోజు (శనివారం) నెలవంక దర్శనం ఇవ్వడంతో ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ముస్లిం సోదరులు, సోదరీమణులు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు ఆచరిస్తారు.