INDIAN | జాతీయ గీతానికి 150 ఏళ్లు

INDIAN | జాతీయ గీతానికి 150 ఏళ్లు
వందేమాతరం గీతాన్ని ఆలపిస్తున్న బిజెపి నాయకులు
INDIAN | నర్సంపేట, ఆంధ్రప్రభ : 150 ఏళ్ల వందేమాతరం మహోత్సవంలో ప్రతి భారతీయుడు పాల్గొని గీతాలాపన చేయాలని బీజేపీ జాతీయ నాయకులు మార్తినేని ధర్మారావు తెలిపారు. నర్సంపేట పట్టణ కేంద్రంలోని వరంగల్ రోడ్లో భూమి గౌరవాన్ని ప్రతిధ్వనించే వందేమాతరం జాతీయ గీతం 150 ఏళ్లు సందర్భంగా సమావేశాన్ని నిర్వహించి వివిధ పాఠశాలల ఉపాధ్యాయుల తో వందేమాతర గేయాన్ని శనివారం ఆలపించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, ధర్మా రావులు మాట్లాడుతూ ఆనాడు స్వతంత్ర ఉద్యమం కోసం జాతిని జాగృతం చేయడానికి ఉద్భవించిన వందేమాతర గీతం ఎంతో మంది ఉత్తేజ పరిచి యువతలో దేశభక్తి నింపి తెల్లవాడిని తరిమి కొట్టి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు.
ప్రతి వ్యక్తిలో దేశభక్తి నిండి ఉండాలని ఎక్కడున్నా దేశం కోసం భారత సంస్కృతిని కాపడం కోసం భారత ఖ్యాతిని ప్రపంచ నలుమూలల వ్యాపింప చేయడం కోసం పని చేయాలన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో జాతీయ వాదాన్ని ముందుకు తీసుకెళ్తూ, భారతీయులం అందరం ఐకమత్యంతో ఉండేలా,మన జాతీయ వాదం కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నర్సింహరాములు,జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్,రాష్ట్ర ఓ బి సి మోర్చా అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు (Official Spokeperson Gaddam Anjaneyulu) పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రాంచందర్ రెడ్డి,జిల్లా కార్యదర్శి గుడిపూడి రాధాకృష్ణ, నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, నర్సంపేట మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్, వనపర్తి మల్లయ్య, కునమల్లా పృథ్వీ రాజ్,శీలం సత్య నారాయణ,కుంభం కోమల్ రెడ్డి, పొదిల్లా రాంచందర్ పాల్గొన్నారు.
