BIRTHDAY| అవనిగడ్డ, ఆంధ్రప్రభ : భాషా సంస్కృతుల పరిరక్షణకు కృష్ణారావు కృషి అనితర సాధ్యమని శ్రీకాకుళం డీసీ చైర్మన్ అయినంపూడి భానుప్రకాష్ అన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహకులు స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం అవనిగడ్డ వంతెన సెంటర్లోని కృష్ణారావు విగ్రహానికి ఘంటసాల మండలం చిలకలపూడి గ్రామ నాయకులతో కలిసి చైర్మన్ భాను, కోసూరు డీసీ వైస్ చైర్మన్ పరిశే చలపతిరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చిలకలపూడి నుంచి విచ్చేసిన గ్రామ టీడీపీ అధ్యక్ష, కార్యదర్శులు కొణతం శ్రీనివాస్, కర్రా చిన్న నరసింహారావు, నాయకులు కొణతం రాంబాబు, హరిబాబు, ధర్మారావు, శ్రీనివాసరావు, వీర్ల జనార్దనరావు, శ్రీనివాసరావు, కొణతం నాగేశ్వరరావు, అంజిబాబు, వీరంకి బాలకృష్ణ, కొణతం వాసుబాబు, కొణతం అంజిబాబు, కుక్కల వెంకటకృష్ణ, కొణతం వెంకట శ్రీనివాసరావు నివాళులు అర్పించారు. మండలి వెంకట కృష్ణారావు శత జయంతి కమిటీ, గాంధీ క్షేత్రం, మండలి అభిమానుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, జనసేన ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మాచవరపు ఆదినారాయణ, పీఏసీఎస్ చైర్మన్లు యలవర్తి చిన్నా, మాదివాడ రత్నారావు, గాంధీ క్షేత్రం మత్తి శ్రీనివాసరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మానేపల్లి కోటయ్య, ప్రముఖ న్యాయవాది బొప్పన వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు, దివిసీమ లలిత కళా సమితి ప్రధాన కార్యదర్శి కూనపరెడ్డి చంద్రశేఖర్, డీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్, టీసీ అధ్యక్షులు రేపల్లె రవీంద్ర, ఉప సర్పంచ్ మండలి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ బండే కనకదుర్గ, ఆసుపత్రి డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి, కూటమి నాయకులు బచ్చు శ్రీహరి, సిద్ధినేని అశోక్ నాయుడు, బండే రాఘవ, తోట రాంబాబు, పుల్లగోరు రాజేంద్ర, అన్నపరెడ్డి రామదాసు, డేగల రాఘవ, బాలు శ్రీనివాస్, కమ్మిలి సాయి భార్గవ, అన్నపరెడ్డి వెంకటేశ్వరరావు, చెన్ను గాంధీ, చెన్ను బాబూరావు, మండలి రామ్మోహనరావు, విశ్వనాధపల్లి పాప, ఆకుల సీతామహాలక్ష్మి, బడే సుబ్బారావు, మొగల్ మురాద్, వాహేదుల్లా, గుడివాక నరహరి, బచ్చు ఆదినారాయణ, దామెర్ల సతీష్, యాసం శ్రీరాములు, మెగావత్ గోపి, మైలా హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

