Y.S.Jagan | సీబీఐ కోర్టుకు నేడు జగన్..

Y.S.Jagan | సీబీఐ కోర్టుకు నేడు జగన్..


Y.S.Jagan, హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఇక్కడి సీబీఐ (CBI) ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుకానున్నారు. సుదీర్ఘకాలంగా బెయిల్ పైనే ఉన్న ఆయన తాజా కోర్టు ఆదేశాలతో న్యాయస్థానం ముందుకు రానున్నారు. ముఖ్యమంత్రి హెూదాలో 2020, జనవరి 10న జగన్మోహన్ రెడ్డి చివరిసారిగా విచారణకు హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా తనకు భద్రత అవసరమని.. పాలనా బాధ్యతల నేపథ్యంలో తాను కోర్టుకు హాజరు కాలేనని అపట్లో పిటిషన్ దాఖలు చేసి సీబీఐ ప్రత్యేక కోర్టు నుంచి అనుమతి పొందారు.

అయితే.. జగన్ లండన్ వెళ్లిన సమయంలో ఫోన్ నంబరు తప్పుగా ఇవ్వడంతో.. జగన్ (Jagan) కోర్టుకు హాజరు కావాల్సిందేనంటూ అక్రమాస్తుల కేసును విచారిస్తున్న సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం జగన్ కు ప్రతిపక్షనేత హెూదా కూడా లేదు. ఈ నెల 21లోగా విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో గురువారం న్యాయస్థానం ఎదుట హాజరుకానున్నారు. దాదాపు 23 నెలల క్రితం ఒకసారి జగన్ హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఇదే. జగన్ కోర్టుకు వస్తుండడంతో ఆయనను చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండడంతో హైదరాబాద్ నగర పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.

మరి కొన్ని వార్తలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

https://epaper.prabhanews.com