UttamKumarReddy |మోడల్ నియోజకవర్గంగా మిర్యాలగూడ

- జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది
UttamKumarReddy | మిర్యాలగూడ, ఆంధ్రప్రభ : మిర్యాలగూడను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఉమ్మడి (nalgonda) నల్లగొండ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ రోజు మిర్యాలగూడ మండలం కాల్వపల్లి అడ్డరోడ్డు వద్ద శెట్టి పాలెం అవంతిపురం వరకు 74 కోట్ల రూపాయలతో వేయనున్న అవుటర్ రింగ్ రోడ్డు పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘువీర్ రెడ్డి , ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కార్యకర్తల త్యాగం తోనే రాష్ట్రంలో (Cong)కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. తెలంగాణ చరిత్రలో నిలబడే విధంగా 60 వేల కోట్ల రూపాయలతో రోడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 22 నెలల కాలంలోనే దేశంలో ఎక్కడ లేని విధంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇస్తున్నామని గుర్తు చేశారు.
మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రతి సింగిల్ రోడ్డును డబుల్(Double Roads) రోడ్డు చేస్తామన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మిర్యాలగూడ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ దక్కకపోగా, బీఆర్ఎస్ నాలుగు ముక్కలైందన్నారు.
