Less NPA | ఎన్‌పీఏ తగ్గితేనే.. బ్యాంకు పురోభివృద్ధి
- కర్నూలు జిల్లా డీసీవో వెల్లడి
ఎమ్మిగనూరు టౌన్, ఆంధ్రప్రభ : మొండి బకాయిలు తగ్గిస్తేనే బ్యాంకు పురోభివృద్ధి సాధ్యం అవుతుం అని డిసీవో వెంకట కృష్ణ స్పష్టం చేశారు. సహకార వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శనివారం ఎన్ పీఏల పై జిల్లా సహకార అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మిగనూరు టౌన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ( Emmaganur Cooparative Bank) లో కార్యకలాపాల బలోపేతం, లోన్ సేవల మెరుగుదల, ఎన్ పీ ఏ (NPA) తగ్గింపునకు వినతులను బ్యాంకు చైర్మెన్, డైరెక్టర్లు డీసీఒకు సమర్పించారు.
ఈ సందర్భంగా చైర్మన్ ప్రతాప్ ఉరుకుందయ్య శెట్టి, డైరెక్టర్లు బ్యాంకు అభివృద్ధి ( For Bank Devalop ment) దిశగా నాలుగు ప్రధాన అంశాలను ( Four Key Notes) ప్రస్తావిస్తూ వినతి పత్రాన్ని (Memorandum) డిసీవోకు అందించారు. ప్రస్తుతం ఉన్న రూ.5,00,000 లోన్ పరిమితి (Loan Permit) ని రూ.10,00,000 కు పెంచి, సభ్యులకు మరింత ఆర్థిక సహకారం (Econamical support) అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎన్ పీ ఏ (NPA) లను తగ్గించడానికి అవసరమైన ఆక్షన్ సేల్ (Auctoion Sale) ప్రక్రియకు తగిన అధికారాలు, అనుమతులను బ్యాంకుకు (Cooperative Bank) ఇవ్వాలని అభ్యర్థించారు. ఇప్పటికే డిక్రీ (Decre) అయిన పలు పాత లోన్లను ( Old Loans) ఒక నెలలోపే అక్షన్ సేల్ కి తీసుకురావడంలో అధికార యంత్రాంగం పూర్తి సహకారం అందించాలనే విజ్ఞప్తి చేశారు.
ముఖ్య అతిథి డీసీవో మాట్లాడుతూ 80 ఏళ్ల కిందట ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం పద్మశ్రీ మాచాని సోమప్ప ఈ బ్యాంకును స్థాపించారు. కానీ ప్రస్తుతం బ్యాంకులో సుమారు 75 మంది వరకు (defaulters) మొండి బకాయిలు (NPA) ఉన్నట్లు తెలుస్తోందని ఎన్ పీ ఏ లు పెరుగుతుంటే బ్యాంక్ ఆర్థిక స్థితి దెబ్బతినే అవకాశం ఉంది. పాలకవర్గం వెంటనే రికవరీపై (Recovery) పూర్తిగా దృష్టి పెట్టాలి, ఎన్ పీ ఏ లు రికవరీ అయితే సభ్యులకు డివిడెండ్ (Devidant) ఇవ్వడం కూడా సాధ్యం అవుతుంది, అన్నారు. దాని శాతం తగ్గితే బ్యాంక్‌కు టీఎం ™ ఏర్పాటు చేసుకునే అర్హత కూడా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో , డైరెక్టర్లు నరసప్ప, వెంకట గిరి, సీఈవో బ్యాంక్ సిబ్బంది, బ్యాంకు సభ్యులు పాల్గొన్నారు.
