Crime | నిందితుడి అరెస్టు…
Crime | నిందితుడి అరెస్టు…
Khammam | నెక్కొండ, ఆంధ్రప్రభ : నెక్కొండ మండలంలోని పలు ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు నెక్కొండ ఎస్సై మహేందర్(S.I. Mahender) తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నెక్కొండ మండలంలోని బొల్లికొండ(Bollikonda) గ్రామానికి చెందిన బానోత్ అజయ్ కుమార్(Banoth Ajay Kumar) అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకొని అతడి వద్ద నుంచి 28 తులాల వెండి, ఒక తులం బంగారం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుడి పై గతంలో పలు చోరీ కేసులు ఉన్నాయని అన్నారు. నిందితుడిని మహబూబాబాద్(Mahabubabad) సబ్ జైలుకు తరలించినట్లు తెలిపారు.
