Pawan Kalyan |డిప్యూటీ సీఎం విజిలెన్స్

Pawan Kalyan |డిప్యూటీ సీఎం విజిలెన్స్
మంగళం పేట అడవి కబ్జా
పెద్దిరెడ్డికి మరో కేసు షాక్
ఈ సారి ఫారెస్టు ఆఫీసర్లు
పులిచెర్లలో కేసు నమోదు

( చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ)
Pawan Kalyan | చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి, పుంగనూరు మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddi Reddy ) పై భూమి అక్రమాల ఆరోపణల ( land anchrochment) నేపథ్యంలో.. విచారణ కీలక దశకు చేరింది. కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత అత్యంత దూకుడుతో దర్యాప్తు ముందుకు సాగుతున్న తరుణంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ( Deputy CM ) ప్రత్యేక దృష్టి (Special Focus) సారించడంతో ఈ కేసు కీలక మలుపు తిరుగుతోంది. పలమనేరులో పర్యటన సందర్భంగా హెలికాప్టర్ నుంచి స్వయంగా డిప్యూటీ సీఎం (Pawan Klyan) తీసిన వీడియో ( Video Shoot) దృశ్యాలు, మంగళంపేట అటవీ (Mangalm Peta Forest) ప్రాంతంలో జరిగిన భారీ ఆక్రమణలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ విభాగాలు అపూర్వ వేగంతో చర్యల వైపు అడుగులు వేశాయి. పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అడవి భూములను ఆక్రమణ కేసును పులిచర్ల పోలీస్ స్టేషన్ లో నమోదు చేశారు పెద్దిరెడ్డి పై అన్ని కేసులను నిగ్గు తేల్చాలని కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
తెర మీదకు అడవి కబ్జా
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి అక్రమాలకు సహకరించిన అధికారులను గురించి కూడా ఆరా తీస్తున్నారు. వారి మీద కూడా చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. చిత్తూరు జిల్లా పులిచర్ల (pulicharla) మండలం మంగళంపేట అటవీ భూముల ఆక్రమణ కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావు మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాలు మరింత సంచలనం రేపాయి. మదర్ రికార్డుల ప్రకారం 1968 గెజిట్‌లో 75.74 ఎకరాల అటవీ భూములకు మాత్రమే పట్టాలు ఉన్నప్పటికీ, అదనంగా 32.63 ఎకరాలను కూడా కంచె వేసి (Fencing) కలుపుకున్నారని అధికారులు తెలిపారు. ఇలాంటి భారీ ఎత్తున అటవీ భూములను చట్ట విరుద్ధంగా స్వాధీనం చేసుకుని ఉద్యాన పంటలు వేసి (horticulture) ఆదాయం పొందడం, బోర్ వెల్‌లు (Bore Wells) తవ్వడం, అటవీ వనరులను దుర్వినియోగం చేయడం వంటి అంశాలు కేసులో ప్రధాన ఆరోపణలుగా నమోదయ్యాయి. మొత్తం మీద రూ.1.26 కోట్ల విలువైన అటవీ సంపదకు నష్టం కలిగిందని అటవీశాఖ స్పష్టంచేసింది. ఈ ప్రాథమిక విచారణ అనంతరం పులిచర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయగా, ఎంపి మిథున్‌రెడ్డిని A1గా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని A2గా, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిని A3గా, పెద్దిరెడ్డి ఇందిరమ్మను ఎ4గా కేసులో చేర్చారు.
అధికారులకూ ఉచ్చు
అధికారుల మద్దతుతో రికార్డులను తారుమారు చేసిన విషయంలో కూడా అనుమానాలు వ్యక్తమవడంతో, ఈ వ్యవహారంపై ప్రత్యేక విచారణ కమిటీ పనిచేస్తోంది. అయితే ఇది ఒక్క కేసే కాదు. గతంలో పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిన భూముల మొత్తం చరిత్రను ప్రభుత్వం ఇప్పుడు వెలికితీస్తోంది. జనసేన నేతలు తిరుపతిలో పెద్దిరెడ్డి నివాస భవనం, (peddi reddy building) ఇతర స్థలాలపై చేసిన ఆందోళనలను కూడా ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లోని భారీ మొత్తంలో ( madanapalli lands) భూములు, వాటిపై ఉన్న అనుమానాస్పద కబ్జాలు, రెవెన్యూ ఫైళ్లు తగులబెట్టిన కేసులో పెద్దిరెడ్డి ప్రమేయం ఉన్నట్టుగా వచ్చిన ఆరోపణలు దర్యాప్తు సంస్థల దృష్టిలో ఉన్నాయి. పెద్దిరెడ్డి కుటుంబం అక్రమంగా స్వాధీనం చేసుకున్న భూములు ఎక్కడున్నాయో, ఎవరు సహకరించారో, ఏ రికార్డులు మార్చారో అన్నింటిని సవివరంగా పరిశీలించాలని చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసుల్లో అధికారుల పాత్ర ఉన్నట్లయితే ( mingled officials) వారిపైనా చర్యలు తప్పదని స్పష్టం చేశారు. అటవీ భూముల పూర్తి సర్వేని పూర్తి చేసి వివరాలను వెబ్‌సైట్‌లో ( Forest web site) ఉంచాలని పవన్ కల్యాణ్ ఆదేశించడంతో, ఈ వ్యవహారంలో పారదర్శకత కు ప్రభుత్వం పెద్దపీట వేసింది.
టార్గెట్ పెద్దిరెడ్డి ఫ్యామిలీ

కేంద్ర సంస్థల దృష్టికి వెళ్లిన లిక్కర్ స్కాంలో కూడా మిథున్‌రెడ్డి ఇప్పటికే నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పెద్దిరెడ్డి కుటుంబం చుట్టూ చట్టపరమైన ఉచ్చు మరింత బిగుస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి పెద్దిరెడ్డి కుటుంబంపై భూమి అక్రమాలు, రికార్డు మార్పిడి (record manipulation) , అటవీ ఆక్రమణ, లిక్కర్ వ్యవహారాలు (Liquor cases)… అన్నింటినీ నిగ్గుతేల్చడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కేసుల దర్యాప్తు ఎలాంటి రాజకీయ భూకంపాలకు దారితీస్తుందో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా గమనిస్తున్నారు.
