ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి

- సీఐ దేవేందర్‌రావు
మంచిర్యాల జిల్లా, చెన్నూర్ (ఆంధ్రప్రభ): చెన్నూర్ లయిన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత వైద్య సేవలను ప్రతి వర్గానికి చెందిన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెన్నూర్ సీఐ దేవేందర్‌రావు కోరారు. లయిన్స్ క్లబ్ నిర్వహణలో ఈ నెల 18న జరగనున్న ఉచిత నేత్ర వైద్య శిబిరం కోసం రూపొందించిన వాల్ పోస్టర్లను సీఐ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో లయిన్స్ క్లబ్ అందించిన నేత్ర వైద్య సేవలు ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా నిలిచాయని అభినందించారు.
