Telangana | ఘనంగా బాలాల దినోత్సవం…

Telangana | ఘనంగా బాలాల దినోత్సవం…
Telangana | నెల్లికుదురు, ఆంధ్రప్రభ : భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రు జన్మదినం సందర్బంగా ఈ రోజు మండలంలోని నైనాల ప్రాథమికొన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏవి సంజీవ రావు(What are Sanjeeva Rao) ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా బాల బాలికకు సంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. విద్యార్థులకు స్వీట్లు, చాక్లేట్ల పంపిణి తోపాటు, బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమాలలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ఆర్. రాధిక, ఉపాధ్యాయులు రాజు, సోమయ్య, రాంబాబు, లోకేందర్, సునీల్, రాకేష్, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
