Telangana | డయాబెటిస్ నివారణ ర్యాలీ

Telangana | డయాబెటిస్ నివారణ ర్యాలీ

Telangana | కొడకండ్ల, ఆంధ్రప్రభ : వరల్డ్ డయాబెటిస్ డే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కొడకండ్ల మండల వైద్య అధికారులు నిర్వహిస్తున్న ర్యాలీలో ముఖ్యఅతిథిగా జనగాం జిల్లా డిఎంహెచ్ఓ కే మల్లికార్జున రావు(DMHO K Mallikarjuna Rao) పాల్గొన్నారు.

డయాబెటిస్ నివారణ, ప్రారంభ నిర్ధారణ, నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ర్యాలీ నిర్వహించామని డిఎంహెచ్వో అన్నారు. కొడకండ్ల వైద్య అధికారులు, సిబ్బంది చురుకుగా పాల్గొని ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం, వ్యాయామం, రెగ్యులర్ స్క్రీనింగ్ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ కమల్, డాక్టర్ హరికృష్ణ రెడ్డి, డాక్టర్ భారతి, డాక్టర్ ప్రీతి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply