Kamareddy | వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలి

Kamareddy | వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలి

నోడల్ ఆఫీసర్ షేక్ సలాం


Kamareddy | కామారెడ్డి, తాడ్వాయి, ఆంధ్రప్రభ : మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం జిల్లా నోడల్ ఆఫీసర్ షేఖ్ సలాం (Nodal Officer Sheikh Salam) తనిఖీ చేశారు. తనిఖీలు భాగంగా రికార్డ్స్ పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. అర్థ సంవత్సర పరీక్షల నిర్వహణ పరిశీలించారు. అలాగే కళాశాల అధ్యాపకులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.. ప్రణాళిక బద్దంగా బోధన చేస్తూ వార్షిక పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని సూచించారు.

ఫిబ్రవరిలో పరీక్షలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అధ్యాపకులు ముందస్తుగా గ్రామాలకు వెళ్లి పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల (students) ను కలవడం సంతోషకరమని, ఇక్కడి అధ్యాపకులను అభినందించారు. అలాగే వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు తీసుకు రావాలని సూచించారు. కళాశాలలో జరుగుతున్న పనులను అయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ యూసుఫ్ హుస్సేన్, అధ్యాపకులు పాల్గొన్నారు.

Leave a Reply