Metro Charges – సవరించిన మెట్రో టికెట్ ధ‌ర‌లు ఇవే…

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : హైదరాబాద్‌ మెట్రో స‌వ‌రించిన ధ‌ర‌లు శ‌నివారం నుంచి అమ‌లు చేయ‌నుంది. టికెట్‌ ధరలను ఇటీవల పెంచిన ఎల్‌ అండ్‌ టీ సంస్థ.. సవరించిన ధరలపై తాజాగా ప‌ది శాతం తగ్గిస్తున్నట్లు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం మెట్రో ఛార్జీలను సవరణ చేస్తూ విడుదల చేసింది. ప‌ది శాతం తగ్గించిన తర్వాత మెట్రో ఛార్జీలను ఎల్ అండ్ టీ మెట్రో ప్రకటించింది. ఇందులో భాగంగా కనిష్టంగా రెండు కిలోమీటర్ల లోపు టికెట్ ధర రూ. 11 చేసింది. గరిష్ఠంగా రూ.69 వరకు ధరలను నిర్ణయించింది. ఇక తగ్గిన చార్జీలు మే 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు సంస్థ స్పష్టం చేసింది.

స‌వ‌రించిన టికెట్ వివ‌రాలు

  • రెండు కిలోమీటర్ల వరకు రూ. 11
  • 2 నుంచి 4 కిలోమీటర్ల వరకు రూ.17
  • 4 నుంచి 6 కిలోమీటర్ల వరకు రూ.28
  • 6 నుంచి 9 కిలోమీటర్ల వరకు రూ.37
  • 9 నుంచి 12 కిలోమీటర్ల వరకు రూ.47
  • 12 నుంచి 15 కిలోమీటర్ల వరకు రూ.51
  • 15నుంచి 18 కిలోమీటర్ల వరకు రూ.56
  • 18నుంచి 21 కిలోమీటర్ల వరకు రూ.61
  • 21 నుంచి 24 కిలోమీటర్ల వరకు రూ.65
  • 24 నుంచి ఆపై కిలోమీటర్ల కు రూ.69

Leave a Reply