Telangana | చదువుకున్న పాఠశాలకే…

Telangana | చదువుకున్న పాఠశాలకే…
Telangana | బిక్కనూర్, ఆంధ్రప్రభ : తాను చదువుకున్న పాఠశాలకు ముఖ్య అతిథిగా రావడం ఎంతో ఆనందంగా ఉందని వైద్యురాలు హెమిమా (Doctor Hemima) అన్నారు. శుక్రవారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో గల చైతన్య విద్యానికేతన్ పాఠశాలలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గతంలో పాఠశాలలో చదువుకొని ప్రస్తుతం జిల్లా ఇన్చార్జి ఎం సి హెచ్ ప్రోగ్రాం అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ హేమీమా హాజరయ్యారు. సందర్భంగా వేదిక ద్వారా పూర్వ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ… భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజంలో ముందుకు పోవాలని చెప్పారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకోవాలని ఆమె తెలిపారు. అనుకున్న లక్ష్యాన్ని ప్రతి విద్యార్థి చేరుకోవాలని సూచించారు.

అనంతరం ఆరోగ్యపరమైన పలు సలహాలు (Health advice) సూచనలు, విద్యార్థులకు తెలియజేశారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అతిథులను పాఠశాల అధ్యాపక బృందం సత్కరించింది. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రేణు కుమార్, ప్రధానోపాధ్యాయులు అశోక్ యాదవ్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
