Ranga Reddy | ఆక‌స్మిక త‌నిఖీ…

Ranga Reddy | ఆక‌స్మిక త‌నిఖీ…

Ranga Reddy | తాండూర్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తాండూర్‌ మండలం కరణ్ కోర్టు గ్రామ జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన తాండూరు సబ్ కలెక్టర్ మా శంకర్ ప్రసాద్(Shankar Prasad) విద్యార్థులతో ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం అందిస్తుందా లేదా అని ఆరా తీశారు. వారంలో ఎన్నిసార్లు గుడ్లు ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.

వారంలో మూడు రోజులు గుడ్లు ఇస్తున్నట్లు చెప్పారు. అన్నం, పప్పు, కూరగాయలు వడ్డిస్తున్నారని తెలుసుకొని వంటగదిని పరిశీలించారు. అనంతరం పిల్లలకు వడ్డించే బియ్యం పరిశీలించగా అందులో పురుగులు, రాళ్లు సబ్ కలెక్టర్ కి కనిపించాయి. ఇదేనా మీరు వడ్డించే బియ్యం అని, మీరు ఇలానే తింటారా, బియ్యం(rice), పురుగులు ఒకేలాగ ఉన్నాయ‌న్నారు.

పిల్ల‌ల‌కు ఇలాగే పెడుతున్నారా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇకనుంచి బియ్యం వండొద్దని వెంటనే రిటర్న్ చేసి మంచి బియ్యం తీసుకువచ్చి పిల్లలకి భోజనం వడ్డించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట తాసిల్దార్ తారా సింగ్, ఎంపీడీవో విశ్వప్రసాద్, విద్యాధికారి వెంకటాయ గౌడ్, ఉపాధ్యాయులు ఉన్నారు.

Leave a Reply