Burgampadu : తల్లి బిడ్డ క్షేమం..

Burgampadu : తల్లి బిడ్డ క్షేమం..

బూర్గంపాడు, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు (యం)చింతకుంట గ్రామనకి చెందిన మడివి రాజి(23) అనే మహిళ నిండు గర్భిణీ కాగా ఈ రోజు పురిటి నొప్పులు అధికమవడంతో 108 అంబులెన్స్ కు సమాచారం అందించింది. స్పందించిన అంబులెన్స్ సిబ్బంది(Ambulance crew) వివరాలు అడిగి తెలుసుకుని హుటాహుటిగా ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అటవీ ప్రాంతంలో ఉన్న వలస గిరిజన గ్రామం చింతకుంట రోడ్డు అధ్వానంగా ఉండడంతో అంబులెన్స్ వస్తుందో రాదో అని ఎదురుచూస్తున్న తరుణంలోనే గోతుల రోడ్డులో కూడా అంబులెన్స్ పైలెట్ విజయభాస్కర్(pilot Vijayabhaskar) చాకచక్యంగా వాహనాన్ని నడిపి నిండు గర్భిణీని అంబులెన్స్ లో ఎక్కించుకొని హాస్పటల్ కి తీసుకువచ్చే తరుణంలో నొప్పులు అధిక‌మ‌య్యాయి.

దాంతో అంబులెన్స్ సిబ్బంది వాహనాన్ని మార్గం మధ్యలో నిలిపి డెలివరీ చేశారు. మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవ అనంతరం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని మెడికల్ టెక్నీషియన్ సుభద్ర తెలియజేశారు. సమీప ఆసుపత్రి మొరంపల్లి బంజర పీహెచ్ సీకి త‌ర‌లించారు. ఈ ఆపరేషన్ లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ , పైలెట్ చాకచాక్యంగా వ్యవహరించిన తీరు పట్ల 108 అంబులెన్స్ సిబ్బందికి చింతకుంట గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply