doctor | గుండెపోటుతో మృతి..!

doctor | గుండెపోటుతో మృతి..!
doctor | ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో క్యాజువల్ మెడికల్ ఆఫీసర్ (సిఎంవో)గా పని చేస్తున్న యంగ్ డాక్టర్ (young doctor) జి. నగేష్ గౌడ్ (Dr. G. Nagesh Goud) (31) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న డాక్టర్ నగేష్ గౌడ్ రాత్రి తన ఇంట్లో చాతి నొప్పి రావడంతో వెంటనే రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ఈసీజీ, బీపీ పరీక్షలు నిర్వహించుకోగా నార్మల్ రిపోర్ట్స్ వచ్చినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆ తర్వాత కోజా కాలనీలో తన మిత్రుడు ఇంటికి వెళ్ళగా అక్కడే ఛాతిలో నొప్పి ఉందని గుండెపై చేయి వేసుకొని కుప్ప కూలినట్టు తెలిపారు. సిద్దిపేట జిల్లా (Siddipet District) కు చెందిన డాక్టర్ నగేష్ కుటుంబం గత కొన్నేళ్లుగా టీచర్స్ కాలనీలోనే నివాసం ఉంటున్నారు. యువ వైద్యుడు హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందడంతో రిమ్స్ డాక్టర్లు దిగ్బ్రాంతికి లోనయ్యారు.
మృతిచెందిన డాక్టర్ నగేష్ (Dr. Nagesh) అవివాహితుడని కుటుంబ సభ్యులు తెలిపారు. తిరుపెల్లి స్మశాన వాటికలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించగా రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జై సింగ్, రేడియాలజీ హెచ్ ఓ డి డాక్టర్ కళ్యాణ్ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ దీపక్ పుష్కర్, సహచర క్యాజువాలిటీ మెడికల్ అధికారులు హాజరై నివాళులర్పించారు.
