Bihar Result Nov 14 | బీహార్ తీర్పు ఇదేనా..

బీహార్ తీర్పు ఇదేనా..

దేశంలో ప్రధాని మోదీకి (Prime Minister Narendra Modi) తిరుగులేదని.. బీజేపీకి ఓటమి లేదని.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టం అయినట్టుగా ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. బీహార్ లో మరోసారి మోదీ హవా కొనసాగినట్లుగా వెల్లడించాయి. బీజేపీ – జెడీయూ నేతృత్వంలోని ఎన్టీయే కూటమి అధికారం చేపడుతుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎన్టీయే, మహాఘట్ బంధన్ కూటముల మధ్య గట్టి పోటీ జరిగినప్పటికీ విజయానికి అవసరమైన స్థానాలను ఎన్టీయే కూటమి కైవసం చేసుకుంటుందని పేర్కొన్నాయి. తద్వారా ఎన్టీయే కూటమి బీహార్ లో అధికారం కాపాడుకుంటుందని తెలిపాయి.

ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదని కూడా తెలియచేశాయి. (Bihar) బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా అక్కడ అధికారం చేపట్టేందుకు 122 స్థానాల్లో విజయం సాధించడం అవసరం. ఎన్టీయేకు మెజార్టీ దక్కుతుందని అంచనా వేశాయి. దైనక భాస్కర్ ఎన్టీయే 145 – 160 స్థానాలు గెలుచుకుంటుందని, మహాఘట్ బంధన్ (Mahagath bandhan) 73 – 91 స్థానాలు దక్కించుకుంటుందని, ఇతరులు 5 – 10 సీట్లు గెలుచుకుంటారని అంచనా వేసింది. పీపుల్స్ ఇన్ సైట్ ఎన్టీయే 133 – 148, ఇండియా కూటమి 87 -102, జన్ సురాజ్ 0 – 2, ఇతరులు 3 – 6 స్థానాలు గెలుచుకుంటారని తెలియచేసింది. పీపుల్స్ పల్స్, చాణక్య స్ట్రాటజీస్, డీవీ రీసెర్చ్.. ఇలా అన్ని సర్వేలు ఎన్టీయేదే అధికారం అని చెబుతున్నాయి.

Leave a Reply