మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా..

మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా..
బిచ్కుంద, ఆంధ్రప్రభ : బిచ్కుంద మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజలు సహకరిస్తేనే అభివృద్ధికి సాధ్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు(Jukkal MLA Thota Lakshmi Kantha Rao) అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలోని అఖిలపక్ష సమావేశం మార్కెట్ కమిటీ యాడ్లో నిర్వహించారు.
బిచ్కుంద మున్సిపాలిటీ సెంటర్ లైటింగ్ పనులు విషయంలో బిచ్కుంద ప్రజలు మండల కేంద్రంలో గ్రామసభలు ఏర్పాటు చేస్తే వచ్చి సమస్యను పరిష్కరించేందుకైనా నేను సిద్ధమైన అంటూ ఆయన అన్నారు. పార్టీలకతీతంగా అభివృద్ధి కోసం ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు ప్రస్తావిస్తే సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఆయన వివరించారు.
ప్రజల సౌకర్యార్థం(convenience of the people) కోసం సెంట్రల్ లైటింగ్ పనులు విద్యుత్తు, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బి శాఖ(RWS, R&B Department), మున్సిపల్ శాఖ అధికారులను కలిసి ప్రజలకు ఇబ్బంది లేకుండా పనులు చేస్తున్నారని ఆయన తెలిపారు. విద్యుత్తు విషయంలో ఒకేసారి తొలగిస్తే విద్యుత్ అంతరాయం ఏర్పడి ప్రజలకి తాగునీటి సమస్య తదితర సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉందని, ఆర్డబ్ల్యూఎస్ శాఖ వారు పైపులైన్లను(pipelines) ఒకేసారి తొలగించడంతో తాగునీటి ఎద్దడి ఏర్పడుతుందన్నారు.
మున్సిపల్ శాఖ వారు డ్రైనేజీ పనులు ఒకేసారి తొలగిస్తే నానా తంటాలు పడాల్సి వస్తుందనీ, వంతుల వారీగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులు వేగవంతం చేస్తున్నామని ఆయన తెలిపారు. బిచ్కుంద సెంట్రల్ లైటింగ్ పనులు కచ్చితంగా పూర్తి చేస్తామని తేల్చి చెప్పారు. జనజీవనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయాల్సి ఉంటుందని కాబట్టి పనులలో కొంత ఆలస్యం జరిగిందని ఆయన వివరించారు.
మున్సిపాలిటీ పరిధిలో మౌలిక రూపాయల కల్పనకు 15 కోట్లు మంజూరయ్యాయని(15 crores have been sanctioned for electricity), భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకొస్తామని తెలిపారు. శాశ్వత తాగునీటి వ్యవస్థ ఏర్పాటు చేయడానికి నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు చేపడతామని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ వారు, సిపిఐ పార్టీ జిల్లా నాయకులు సురేష్ గోండ, ఆర్ అండ్ బి శాఖ కాంట్రాక్టర్ రాజయ్య అండ్ సన్స్, ఆర్ అండ్ బి ఈ ఈ మోహన్(R&B E.E. Mohan), మున్సిపల్ కమిషనర్ ఖయ్యూం, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
