Motkur : ఇప్పటికే 6వేల క్వింటాళ్లు..
- ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు..
మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మార్కెట్ యార్డులో(In the Motkur market yard) సింగిల్ విండో ఆధ్వర్యంలో చేపట్టిన ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడం.. గత వారం రోజులుగా ఎండలు కొడుతుండడంతో రైతన్నలకు కొంత మేర ఊరట కల్గింది.
సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 6 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో(6 grain purchasing centers) ఇప్పటివరకు సుమారు 100 మంది రైతుల వద్ద 6 వేల క్వింటాళ్ల (దొడ్డు రకం) 15000 బస్తాల ధాన్యం కొనుగోలు(15000 bags of grain purchased) చేసినట్లు బ్యాంక్ సీఈఓ కొనతం వరలక్ష్మి తెలిపారు. 6 గురు రైతుల నుండి 280 క్వింటాళ్ల సన్న ధాన్యం (700 బస్తాలు )కొనుగోలు చేసినట్లు సీఈఓ తెలిపారు.

