అసభ్య గీతాలకు విద్యార్ధుల నృత్యం

అసభ్య గీతాలకు విద్యార్ధుల నృత్యం

  • మహబూబాబాద్ మైనార్టీ గురుకుల పాఠశాలలో ఘటన
  • వివాదాస్పదంగా మారిన మైనార్టీ డే కార్యక్రమం
  • ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం

మహబూబాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఈ రోజు జరిగిన మైనార్టీస్ వెల్ఫేర్ డే(Minorities Welfare Day) కార్యక్రమం అనుకోని రీతిలో వివాదానికి దారితీసింది.

విద్యార్ధులు వేదికపై ఊ అంటావా మామ ఊఊ అంటావా, కుర్చి మడతపెట్టి వంటి అసభ్య సినిమా గీతాలకు నృత్యం చేయడం తల్లిదండ్రులను షాక్‌కు గురి చేసింది. పాఠశాల సాంస్కృతిక వేదిక(School Cultural Forum)పై తమ పిల్లలు అలాంటి పాటలకు నృత్యం చేయడం చూసి వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్ధులలో తప్పుడు సందేశాన్ని పంపుతాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.