ప్రత్యేక అభినందన..

ప్రత్యేక అభినందన..
కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ :- నెట్ బాల్ ఎస్ జి ఎఫ్ అండర్ 17 విభాగంలో రాష్ట్రస్థాయికి కోన సముంధర్ విద్యార్థిని పి. సాహిత్య ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. మధుపాలు మంగళవారం తెలిపారు. సోమవారం ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలోని తిర్మన్ పల్లి గ్రామంలో నెట్ బాల్ క్రీడ టోర్నమెంట్ సెలక్షన్ జరిగింది. ఇందులో అత్యంత ప్రతిభ కనబరిచి ఎస్ జి ఎఫ్ అండర్ 17 రాష్ట్రస్థాయి నెట్ బాల్ క్రీడా పోటీలకు జడ్పి హెచ్ ఎస్ కోన సమందర్ పాఠశాలకు చెందిన పి. సాహిత్య 9వ తరగతి విద్యార్థిని ఎంపికైనట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుపాల్, గ్రామ విడిసి అధ్యక్షులు మెల్ల గంగాధర్, సభ్యులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయుల బృందం విద్యార్థిని సాహిత్యను ప్రత్యేకంగా అభినందించారు. ఈనెల 21,22,23, తేదీలలో, నల్గొండలో జరిగే రాష్ట్రస్థాయి నెట్ బాల్ పోటీలో పాల్గొంటుందని పిడి రమేష్ గౌడ్ తెలిపారు. ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి పాఠశాలకు, గ్రామానికి, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
