శాస్త్రోస్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శాస్త్రోస్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతిరూరల్, ఆంధ్రప్రభ : తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6.00 నుండి 9.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు.

ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధిచేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.

హైదరాబాద్ కు చెందిన స్వర్ణకుమార్ రెడ్డి (Swarnakumar Reddy) ప్రతినిధులు అమ్మవారి ఆలయంలో మంగళవారం 7 పరదాలను, అదేవిధంగా తిరుపతికి చెందిన మణి 3 పరదాలను డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, అర్చకులు బాబు స్వామికి దాత అందజేశారు. అమ్మవారి గర్భాలయంలో పరదాలను అలంకరించనున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ (TTD) జేఈవో వి.వీరబ్రహ్మం, సీవీఎస్వో కె.వి.మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, ఆల‌య డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, ఏఈవో దేవరాజులు, ఏవీఎస్వో ఎం.రాధాకృష్ణమూర్తి, సూపరింటెండెంట్ రమేశ్, ఆలయ ఇన్ స్పెక్టర్లు చలపతి, సుబ్బరాయుడు త‌దితరులు పాల్గొన్నారు.


బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలలో విహరించి భక్తులను ఆశీర్వదించనున్నారు. బ్రహ్మోత్సవాల కారణంగా నవంబరు 17 నుంచి 25వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

  • 17-11-2025 (సోమవారం) ధ్వజారోహణం ( ధనుర్ లగ్నం) చిన్నశేషవాహనం
  • 18-11-2025 (మంగళ వారం) పెద్దశేషవాహనం హంసవాహనం
  • 19-11-2025 (బుధవారం) ముత్యపుపందిరి వాహనం సింహవాహనం
  • 20 -11-2025 (గురువారం) కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం
  • 21 -11-2025 (శుక్ర వారం) పల్లకీ ఉత్సవం గజవాహనం
  • 22-11-2025 (శనివారం) సర్వభూపాలవాహనం సా. స్వర్ణరథం, గరుడవాహనం
  • 23-11-2025 (ఆదివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
  • 24-11-2025 (సోమవారం) రథోత్సవం అశ్వ వాహనం
  • 25-11-2025 (మంగళవారం) పంచమీతీర్థం ధ్వజావరోహణం.
  • నవంబర్ 26న పుష్పయాగం.

Leave a Reply