ఆ అవకాశం ఇస్తే.. 100 కోట్లతో..

ఆ అవకాశం ఇస్తే.. 100 కోట్లతో..

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ది జరగలేదని.. తమకు ఈసారి అవకాశం ఇస్తే.. జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని 100 కోట్లతో అభివృద్ది చేసి చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గత కాంగ్రెస్ పాలన (2004 నుంచి 2014)లో కాంగ్రెస్ అభివృద్దిని చూసి ఓటు వేయాలని కోరారు. ఇప్పటికే ఎఫ్ఆర్బీఎం పరిమితి దాటిపోయిన అప్పులతో ప్రభుత్వం అనేక కోణాల్లో ఆర్థిక అవస్థలను ఎదుర్కొంటుందని.. అయినప్పటికీ ఏ రంగంలోనూ వెనక్కి తగ్గకుండా సంక్షేమ రంగాన్ని అగ్రభాగాన నిలబెడుతున్నామని చెప్పారు. ప్రతి నెల ఆదాయానికి మించిన వ్యయాలతో ఇబ్బందికర పరిస్థితి ఉందన్నారు.

సరాసరిగా రూ 18,600 కోట్లు వరకు ఆదాయం వస్తుంటే.. వ్యయం రూ 23,800 కోట్లు దాటిపోతుందని వివరించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై నెల నెల వడ్డీలు, బ్యాంకులు చెల్లింపులు తడిపిమోపెడు అవుతున్నాయిన సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. క్యాన్సర్ వ్యాధి ఫోర్త్ స్టేజ్ లో ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయిందని.. ఇక పై దాచిపెడితే అది చాలా ప్రమాదమని వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థ అనేది ప్రభుత్వంలో అత్యంత గోప్యంగా ఉండాల్సిన అంశమే అయినప్పటికీ విప్పి చెప్పక తప్పని పరిస్థితి నెలకొందని అన్నారు.