మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి..

వరంగల్ జిల్లా, నెక్కొండ, (ఆంధ్రప్రభ) : మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా బలోపేతం కావాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నెక్కొండ మండలంలోని దీక్షకుంట్ల గ్రామంలో మహిళల జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్లాస్టిక్ నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్లాస్టిక్ వాడకన్ని తగ్గించాలని తెలిపారు.

గ్రామంలోని 14 మహిళా సంఘాలకు రెండు కోట్ల 70 లక్షల బ్యాంకు రుణాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ పీడీ రేణుకాదేవి, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నర్సంపేట చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, ఏపీఎం కిరణ్, పెండెం రామానంద్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బక్కీ అశోక్ పాల్గొన్నారు.

Leave a Reply